https://youtu.be/WHjiOEeROn0?si=mqJfEIFe1xgHz1cH
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం:బేహాగ్
నుదుటన దిద్దిన కాసంతబొట్టు
తూరుపు దిక్కున సూరీడైనట్టు
సిగ్గులు పూసిన నీ బుగ్గలు
గురుతు తెచ్చెనే ఎర్రని గులాబీ మొగ్గలు
నువ్వై అగుపించని వస్తువేది లేదు
నువ్వే తలపున తోచని సమయమంటు లేదు
1.తుళ్ళితుళ్ళి తుళ్ళి నవ్వేటి నవ్వుల్లు
సెలయేళ్ళు చేసేటి గలగల సవ్వళ్ళు
చకచక కదలాడు నీ సోగ కన్నుల్లు
కొలనులో తిరుగాడు చిన్నారి మీనాలు
నువ్వై అగుపించని వస్తువేది లేదు
నువ్వే తలపున తోచని సమయమంటు లేదు
2.పిరుదుల్ని దాటిన నల్లటి నీ కురులు
వరదై ఉరికేటి కృష్ణమ్మ జలసిరులు
పిడికిట్లో ఇమిడేటి నీ నడుము పోడుములు
పాపికొండల మధ్య గోదారి పదనిసలు
నువ్వై అగుపించని వస్తువేది లేదు
నువ్వే తలపున తోచని సమయమంటు లేదు
No comments:
Post a Comment