రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
గుండె చెమ్మగిల్లితే కన్ను ఊరకుంటుందా
మనసు నలిగిపోతుంటే నరకమింక ఉంటుందా
మతి లేని ఓ విధీ చేసితివి బ్రతుకు సమాధి
జీవశ్చవాలుగా ఇలా ఎన్నాళ్ళని జీవించేది
1.పుండు మీద పుట్రలాగా కష్టాల పరంపర
గాయాలు మానకుండా ఎదమీద శరంపర
అదిరిపాటుగా వెన్నుపోటుగా అనుక్షణం ఎన్ని దెబ్బలు
నిలువెల్లా తగులబెడితివే మానేనా ఈ కాలిన బొబ్బలు
2.పరిష్కారమే లేనివి సృష్టించిన సమస్యలన్నీ
సమాధానమే దొరకవు సంధించిన ప్రశ్నలన్నీ
ఎదిరించే మార్గంలేదు దీనంగా మౌనంగా భరించడమే
తీర్చగలుగు దేవుడే లేడు పంటి బిగువు సైచడమే
No comments:
Post a Comment