Wednesday, September 1, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:సింధు భైరవి


ఒక బొమ్మకు ప్రాణం పోసావు-ఒక అమ్మకు దైన్యం తీర్చావు

ఒక భక్తుడి నెత్తురు వైనావు-ఒక తండ్రికి అండగ నిలిచావు

సాయని పిలిచినంత ఓయని బదులిచ్చావే

బాబా అని వేడినంత ఇడుములు తొలగించావే

మా మీద కినుకేల-మామీద అలకేల

ఈ జన్మకి ఇంతేయని చింతలోనె మగ్గాల


1.నోరుతెరిచి ఏనాడు కోరింది లేదు నిన్ను

చేయిసాచి ఇది ఇమ్మని అడిగానా మున్ను

దర్శంచుకొన్నాము షిరిడీ పురమునందు

నిను నిలుపుకొన్నాము మా ఉరము నందు

మా మీద కినుకేల-మామీద అలకేల

ఈ జన్మకి ఇంతేయని చింతలోనె మగ్గాల


2.రాసాను ఎన్నెన్నో పాటలు నిను కీర్తిస్తూ

చేసాను భజనలెన్నొ నిను ప్రార్థిస్తూ

మోసాను గురువారం నీ పల్యంకికను

వేచాను నీ దయకై ఆర్తి మీర ఇంకనూ

మా మీద కినుకేల-మామీద అలకేల

ఈ జన్మకి ఇంతేయని చింతలోనె మగ్గాల

No comments: