Monday, September 27, 2021

https://youtu.be/3bFsW_hXmt8?is=wqu9MPMipD-9HpSb

నువ్వంటే పిచ్చేమరి కొందరికి

నువ్వంటే నచ్చవు మరికొందరికి

సాయి నిన్ను సాయబుగా చూస్తారెందుకో

సాయి నీకు మతమంటగడతారేలనో

మానవీయ విలువ తెలుపు మహనీయుడవే

అందరినీ చేరదీసి ఆదరించు వాడవే


1.రోగాలు రుగ్మతలు ఎడబాపిన వైద్యుడవే

ద్వేషవైషమ్యాలు పోకార్చిన సిద్ధసాధ్యుడవే

మానవాళికంతటికీ నిత్య ఆరాధ్యుడవే

జీవకారుణ్య వ్యాప్తికి సాయి నీవు ఆద్యుడవే 

మానవీయ విలువ తెలుపు మహనీయుడవే

అందరినీ చేరదీసి ఆదరించు వాడవే


2.పిలిచినంత పలికేవని నుడివెదరెందరో

తలచినంత ఎదుట నిలుతువందురెందరో

నిన్ను నమ్మి నేను సొమ్ముచేసుకున్నదేమిటని

స్పష్ట పరచు ఇకనైనా అభీష్టమొకటి తీర్చెదవని

మానవీయ విలువ తెలుపు మహనీయుడవే

అందరినీ చేరదీసి ఆదరించు వాడవే



No comments: