రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
నేనే నువ్వై ప్రేమై
మనదే ప్రేమైక లోకమై
శోకాల సడిలేని నాకమై
దేహాలు మైకమై ప్రాణాలు ఏకమై
1.నా కైతకు నీవే కాగితమై
నీ స్వరము నేనను రాగమై
మన సంయోగం ఒక యోగమై
ప్రభవించు జగమున అమోఘమై
2.నా కావ్యపు ముఖ చిత్రానివై
నా హృదయం ఘోషించు స్తోత్రానివై
నేనమితంగ మైమరచు గాత్రానివై
నీవే నీవే నీవే నా జీవన సూత్రానివై
No comments:
Post a Comment