రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
సూదంటురాళ్ళు చక్కని నీ కళ్ళు
చూసేకొద్ది పుట్టు ఎదలో ఎక్కిళ్ళు
కవి తల వెలిసే కవితల పుట్టిళ్ళు
స్వప్న సౌధాలకే అందాల లోగిళ్ళు
దనివారదు నిను గాంచ రేయింబవళ్ళు
1.కొత్తగా చూస్తున్నా కలువలకున్న గుచ్చే చూపుల ముళ్ళు
విస్తుపోతున్నా కను మీనాలాయే నీలొ నర్తించే నెమళ్ళు
గులాబీలు పూస్తున్న చిత్రమైన చెక్కిళ్ళు
అంతలోనె నవ్వుతుంటె బుగ్గల వింత సొట్టళ్ళు
దనివారదు నిను గాంచ రేయింబవళ్ళు
2.నడుమొంపులోనా వళ్ళుతిరిగే సెలయేటి ఉరకల పరవళ్ళు
నాభి కనగ సహకరించు సుళ్ళుతిరిగి ఉసిగొలుపగ దోపిన కుచ్చిళ్ళు
ఆరావళి మేరుగిరుల ఇరుపక్కల ఆనవాళ్ళు
మంటలేక చలికాగగ బిగి కౌగిళ్ళే నెగళ్ళు
దనివారదు నిను గాంచ రేయింబవళ్ళు
No comments:
Post a Comment