Wednesday, June 22, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


లతలా అల్లుకపోయింది నీ స్నేహం

కవితలా అంకురించింది నీపై మోహం

నీ వన్నెచిన్నెలకు మనసు మురిసింది

వలపుల వలనే ఒడుపుగ తను విసిరింది

గుండె సింహాసనంపై రాణిగా నిను కూర్చోబెట్టింది

నన్ను నీ బానిసగా ఎపుడో మార్చేసింది


1.ఇంద్రధనువు కనుబొమలు

చూపులు విరి తూపులు

ఊరించే బూరెలంటి బుగ్గలు

కన్నాను నాసికగా సంపంగి మొగ్గను

తుమ్మెదలను ఆకర్షించే మధుర అధరాలు

నను మైమరిపింప జేసే మదిర దరహాసాలు

గుండె సింహాసనంపై రాణిగా నిను కూర్చోబెట్టాయి

నన్ను నీ బానిసగా ఎపుడో మార్చివేసాయి


2.పైట దాటు పయోధరాలు

చాటులేని నడుము మెలికలు

చాటుతున్నవి వాటి పాటవాలు

నాభిమాత్రం ఒంటిగానే చేసే సవాలు

అరటిబోదెలైనాయి నీ ఊరువులు

తమలపాకులనిపించే లేలేత పాదాలు

గుండె సింహాసనంపై రాణిగా నిను కూర్చోబెట్టాయి

నన్ను నీ బానిసగా ఎపుడో మార్చివేసాయి

No comments: