Wednesday, August 24, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిండు పున్నమే నేడు

ఐనా కటిక చీకటి నాతోడు

నందనవనమే నా ముందు

ఐనా ఎడారి నా మనసందు


ఎన్నుంటేం చెలీ పక్కన నువ్వేలేక

సున్నానైనాను ఫక్కను నీ నవ్వుల్లేక


1.ప్రేమిస్తేనే తెలిసేది ఎడబాటు బాధ

సహానుభూతితోనే ఎరిగేవు మనోవ్యధ

తేలికగా తీసుకోకు నా అపార అనురాగం

తేలితేలి పోనేపోదు నీతో నా సహయోగం


ఎన్నుంటేం చెలీ పక్కన నువ్వేలేక

సున్నానైనాను ఫక్కను నీ నవ్వుల్లేక


2.కంచెలెన్నొ దాటుకొని నీకై అరుదెంచా

ముళ్ళదారులెన్నన్నో కడచి నా చేయందించా

నిన్ను చేర అధిరోహించా ఆగమేఘాలు

నన్ను ఔననడానికింకా ఏల మీనమేషాలు


ఎన్నుంటేం చెలీ పక్కన నువ్వేలేక

సున్నానైనా ఫక్కను నీ నవ్వుల్లేక

No comments: