Thursday, August 4, 2022

 మాట మన్ను బుక్కిస్తుంది

మాట ఎదను తెగ్గోస్తుంది

మాట మమత పంచుతుంది

మాట చనువు పెంచుతుంది

మనుషులను కలిపే వంతెన మాట

మహోన్నతికి చేర్చే నిచ్చెన మాట

మాటే దివ్య మంత్రము మాటే ఇంద్రజాలము

మాటే భవ్య మార్గము మాటే దుర్గమ దుర్గము1.కొన్నికొన్ని మాటలు రతనాల మూటలు

మరికొన్ని మాటలు తేనియల తేటలు

కొన్నిమాటలైతే ఎడతెగని ఊటలు

ఇంకొన్ని మాటలైతే అభ్యున్నతి బాటలు


మాటే దివ్య మంత్రము మాటే ఇంద్రజాలము

మాటే భవ్య మార్గము మాటే దుర్గమ దుర్గము


2.గుండెలో గుచ్చుకుంటాయి ఈటెల మాటలు

కాపురాన చిచ్చుబెడతాయి చెప్పుడు మాటలు

జోల పాటలవుతావు మార్దవాల మాటలు

మేలుకొలుపులవుతాయి స్ఫూర్తివంత మాటలు


మాటే దివ్య మంత్రము మాటే ఇంద్రజాలము

మాటే భవ్య మార్గము మాటే దుర్గమ దుర్గముNo comments: