https://youtu.be/MrX1YG4H-y4?si=Oll4phq1c-wVOtsK
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:మాల్కోస్(హిందోళం)
కోరను స్వామీ నిను కోరికలను కలనూ
ఈడేర్చుము ఈ ఏకైక కడ వేడుకను
పడనీక నను నీ మాయల వలను
సతతము చేయనీ నీ పద సేవలను
తిరు వేంకటనాథ-గొనుమిదె నతులను
మరువక శ్రీనాథ నా వినతులను
1.అభీష్టములకు అంతేలేదు
ఆకాంక్షలకు మోక్షములేదు
ఇష్టములకును ఇంతని లేదు
ఈప్సితముల ఉధృతి ఆగదు
ఎప్పటికప్పుడు ఇదిచాలనుకొని
అడుగుటనాపను నినుతగులుకొని
తిరు వేంకటనాథ-గొనుమిదె నతులను
మరువక శ్రీనాథ నా వినతులను
2.వీక్షణ చక్షువు లక్షణము
శ్రవణము వీనుల తాపత్రయము
ఆఘ్రాణమె నాసిక ఉబలాటము
రసనకు రుచులకు ఆరాటము
కట్టడి సేయము ఇంద్రియములను
ముట్టడి నాపగ ఇహ వాసనలను
తిరు వేంకటనాథ-గొనుమిదె నతులను
మరువక శ్రీనాథ నా వినతులను
No comments:
Post a Comment