Sunday, January 1, 2023

 https://youtu.be/udu2zx7-_ug


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:కళ్యాణి


ఇచ్చిఇచ్చి అలసిపోయినావా

ఇవ్వడానికేమి లేక ఒడిసిపోయినాయా

అడిగినదేదీ కాదని అనవని

కోరినదేదైనా ఒసగేవాడవని

నీకున్నపేరు ఏమవునో ఉమాశంకరా

నిన్నే నమ్ముకున్నానుర నిటలాక్షుడా


1.మనసెరిగీ ఇచ్చినావు మమతతో ఇచ్చినావు

ఒళ్ళు మైమరిచిపోయి నీఆలినీ వరముగ ఒసగినావు

భక్తికి పరవశించి నిన్ను నీవు సైతం వదులుకున్నావు

అందరికన్నీ ఇచ్చిన సుందరేశ్వరా ఏల మిన్నకున్నావు

నీకున్నపేరు ఏమవునో ఉమాశంకరా

నిన్నే నమ్ముకున్నానుర నిటలాక్షుడా


2.అంతలేసి వాంఛలుకావు వింతైన కాంక్షలులేవు

నువ్విచ్చి తిరిగి తీసుకున్నదే ఇవ్వలేకున్నావు

కన్నవారిపైనను ఏకాస్త కరుణను చూపలేకున్నావు

మరోమారు మైమచూపి నిందను తొలగించుకో నీకు నీవు

ఉన్నపేరు ఏమవునో ఉమాశంకరా

నిన్నే నమ్ముకున్నానుర నిటలాక్షుడా

No comments: