https://youtu.be/9yCPjxRQ2Xk
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
గజల్ కాదు,పాటకాదు.. ఇది నా గుండెకయిన
గాయము, హృదయ రుధిరము,నా నయన సలిలము
గుబులేదో దిగులు పెంచె నమ్మవేమే ప్రేయసీ
గుండెనే ముక్కలాయే నన్ను ఖాతరు చేయకుంటే
నర్మగర్భపు మాటలేవో నమ్మతోచెనె ప్రేయసీ
ఆశలే అడియాసలాయే బాస పాతర వేయుచుంటే
మదిని మస్తుగ శోధించా మరో పేరుకోసం ప్రేయసీ
నిలువెత్తు నీరూపే చిత్తరువుగ నిలుచుంటే
మనమధ్యన ఉన్నబంధం మచ్చలేనిది ప్రేయసీ
నీలెక్కకు అదిశూన్యం నా దృష్టిలో అమూల్యమంతే
పట్టుకొని పాకులాడితే బెట్టు పెరుగదా రాఖీ
తేలికగా వదిలేయ్ నేస్తం తెప్పరిల్లగలవంతే
No comments:
Post a Comment