Sunday, February 12, 2023

 https://youtu.be/9GnINEVaI4w?si=OKNA7SJT2kX_of_p

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ 


శివుడిని మించిన ప్రేమికుడెవరు

అర్ధదేహమే ఉమకిచ్చినాడు

బ్రహ్మకన్ననూ ఇల భావుకుడెవరు

నాలుకపైన వాణికి బసకూర్చినాడు

సిరినురమున దాల్చిన హరికెవరు

ధరలో సరి ప్రణయారాధకుడు

ప్రేమ దైవంలా ఒకభావం

ప్రేమ భావనే కదా దైవం


1.రంగూ రుచీ వాసన లేనిది ప్రేమ

రూపం దేహం ప్రాణం ఉన్నది ప్రేమ

అనిర్వచనీయమైన అనుభూతి ప్రేమ

ఋజువు సాక్ష్యం లేని నియతి ప్రేమ

ప్రేమ దైవంలా ఒకభావం

ప్రేమ భావనే కదా దైవం


2.ఆకాశమంత ప్రేమ ఆకాశం ప్రేమ

కాలమున్నంత కాలం కలిగే ప్రేమ

కలకాలం కల ప్రేమ- కలలలోకం ప్రేమ

ప్రేమనే ప్రేమిస్తారు -వ్యక్తులను వదిలేస్తారు

ప్రేమ దైవంలా ఒకభావం

ప్రేమ భావనే కదా దైవం

No comments: