Saturday, June 20, 2009

దారి తప్పినవారిని-దరిజేర్చుకున్నావే 
అక్కరకే రానివారిని -అక్కున జేర్చుకున్నావే 
దయగల మారాజువే-స్వామి శరణమయ్యప్పా 
మముగన్న తండ్రివే - స్వామి శరణమయ్యప్పా 

పడవ నడిపే గుహుడికి –పరసౌఖ్యమిచ్చావే 
ఎంగిలైన పళ్ళనీయ –శబరిని కరుణించావే 
ఉనికిలేని ఉడతకైన-ఉన్నతినే ఇచ్చావే 
శత్రువుకూ తమ్ముడైన శరణన ఆదరించావే 
దయగల మారాజువే-స్వామి శరణమయ్యప్పా 
మముగన్న తండ్రివే - స్వామి శరణమయ్యప్పా 

కుచేలుణ్ని నాడు అపర-కుబేరునిగ మార్చావే
కురూపి ఆ కుబ్జకైన- ప్రేమతొ వరమిచ్చావే 
భక్తిమీర భజన సేయ -మీరాబాయిని బ్రోచావే 
కురుక్షేత్ర సమరంలో-గీతను బోధించావే 
దయగల మారాజువే-స్వామి శరణమయ్యప్పా 
మముగన్న తండ్రివే - స్వామి శరణమయ్యప్పా 

మూగయైన గురుసుతునికి-మాట ప్రసాదించావే దుష్టుడైన వావరుని-దురితము లెడబాపావే కుటిలుడైన మంత్రికీ-గుణపాఠంనేర్పగా అమ్మకొరకు అడవికేగి- పులిపాలు తెచ్చావే పులినేఎక్కి వచ్చావే దయగల మారాజువే-స్వామి శరణమయ్యప్పా మముగన్న తండ్రివే - స్వామి శరణమయ్యప్పా

దారి తప్పినవారిని-దరిజేర్చుకున్నావే 
అక్కరకే రానివారిని -అక్కున జేర్చుకున్నావే 
దయగల మారాజువే-స్వామి శరణమయ్యప్పా 
మముగన్న తండ్రివే - స్వామి శరణమయ్యప్పా

No comments: