Saturday, June 20, 2009

[హిందోళ రాగం ]

[https://youtu.be/HE67lUJJcfM]

వేడితి వేడితి కలలో ఇలలో షిరిడీ సాయీ
మధురంమధురం నీ నామ గానం మది హాయి వేడితి వేడితి కలలో ఇలలో షిరిడీ సాయీ
మధురంమధురం నీ నామ గానం మది హాయి హాయి

ఏజన్మలోని నాపుణ్యఫలమో
నీకృప గాంచితి నే తరియించితి
ద్వారకమాయి విలసిల్లు సాయి
నీదివ్య రూపం నే వీక్షించితి

వేడితి వేడితి కలలో ఇలలో షిరిడీ సాయీ
మధురంమధురం నీ నామ గానం మది హాయి హాయి

ఆశల జోలెతొ నీ దరిజేరితి
ఆర్తిని బాపి దయగను సాయి
భంగపడలేదు భక్తజనులెవ్వరూ
నిన్ను అర్థించి షిరిడీ సాయి

వేడితి వేడితి కలలో ఇలలో షిరిడీ సాయీ
మధురంమధురం నీ నామ గానం మది హాయి హాయి

No comments: