Thursday, June 11, 2009

https://youtu.be/GpUYw-TURF4?si=KRKNfSf2gdl9IYx7

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:దర్బార్ కానడ

నా మొర నాలించవయ్యా- నన్ను పరిపాలించవయ్యా
ఓ బొజ్జ గణపయ్యా-ఓ వికట వెంకయ్యా

1. ఆశల పాలిటి దాసుని జేయకు
భవ బంధాలకు బానిసజేయకు
కలలో ఇలలో కైవల్యములో
నీ నామ స్మరణ మరువనీయకు

2. వేదము నీవే నాదము నీవే
నే నమ్మిన శ్రీ పాదము నీదే
ఆవేదనలో ఆనందములో
సదా నే చేయు ఆరాధన నీదే

3. పిలిచిన పలికే గిరిజానందన
కోర్కెల దీర్చే మూషక వాహన
కరుణాంతరంగా ఓ వక్రతుండా
నీవే నాకిల కొండంత అండ


No comments: