నీ జడలో మెరవాలని పరితపించి పోతోంది
ఈ ఉదయం గులాబి నీ కోసం విరిసింది
నీ జడలో మెరవాలని పరితపించి పోతోంది
తూరుపునా నీబుగ్గా ఎరుపెక్కిందెందుకో
నన్నుచూడగానే సిగ్గుముంచుకొచ్చిందో
తొంగి చూశావేమో నీ తిలకం కనిపైంచింది
గొంతువిప్పావేమో భూపాలం వినిపించింది
ఈ ఉదయం గులాబి నీ కోసం విరిసింది
నీ జడలో మెరవాలని పరితపించి పోతోంది
నా పైనా నీ ప్రేమా మంచుబిందువయ్యింది
కాలందొంగాటకు తామరాకుపై నిలిచింది
నీ కిరణమే మన ప్రేమకారణం
నీ కరుణయే నాకిక శరణం
ఈ ఉదయం గులాబి నీ కోసం విరిసింది
నీ జడలో మెరవాలని పరితపించి పోతోంది
ఈ ఉదయం గులాబి నీ కోసం విరిసింది
నీ జడలో మెరవాలని పరితపించి పోతోంది
No comments:
Post a Comment