Sunday, July 12, 2009

OK

నిన్నే నిన్నే వేడుకొందు శరణమయ్యప్పా-
స్వామి శరణమయ్యప్పా 
శబరిగిరిని చేరుకొందు కావు మయ్యప్పా-
నను కావుమయ్యప్పా

నిన్నే నిన్నే వేడుకొందు శరణమయ్యప్పా-
స్వామి శరణమయ్యప్పా 
శబరిగిరిని చేరుకొందు కావు మయ్యప్పా-
నను కావుమయ్యప్పా

కన్నూ మిన్నూ కానకుంటి- శరణమయ్యప్పా పాపపుణ్యమెంచకుంటి-కావుమయ్యప్పా 
మధు మాంసం వీడకుంటి శరణమయ్యప్పా 
నన్ను కడతేర్చే భారమింక నీదే అయ్యప్పా 

నిన్నే నిన్నే వేడుకొందు శరణమయ్యప్పా-
స్వామి శరణమయ్యప్పా 
శబరిగిరిని చేరుకొందు కావు మయ్యప్పా-
నను కావుమయ్యప్పా

ధనదాహం మరువనైతి- శరణమయ్యప్పా 
వ్యామోహం విడువనైతి కావుమయ్యప్పా 
మదినీపై నిలుపనైతి శరణమయ్యప్పా
కలుషితమెడ బాపి నన్ను కావుమయ్యప్పా 

నిన్నే నిన్నే వేడుకొందు శరణమయ్యప్పా-
స్వామి శరణమయ్యప్పా 
శబరిగిరిని చేరుకొందు కావు మయ్యప్పా-
నను కావుమయ్యప్పా

కామానికి దాసుణ్నైతి శరణమయ్యప్పా 
వ్యసనానికి బానిసైతి కావుమయ్యప్పా 
అన్యధా శరణం నాస్తి శరణమయ్యప్పా 
వ్రతదీక్ష పరిసమాప్తి జేయుమయ్యప్పా

నిన్నే నిన్నే వేడుకొందు శరణమయ్యప్పా-
స్వామి శరణమయ్యప్పా 
శబరిగిరిని చేరుకొందు కావు మయ్యప్పా-
నను కావుమయ్యప్పా

No comments: