ఆనంద భాష్పాలతో అయ్యప్ప- చేసెదను అభిషేకము
చెమరించె నయనమ్ములు –మణికంఠ కనిపించు నాకోసము

లోపాలు మినహా పాలేవి స్వామీ-క్షీరాభిషేకానికి
పెరుగనీ హృది ఉంది పెరుగేది స్వామీ అయ్యప్ప నీ దధి స్నానానికీ
బంధనాలె గానీ గంధాలు లేవయ్య చందనాభిషేకానికీ
అస్మాకమే గాని భస్మాలు లేవయ్య భస్మాభిషేకానికీ
కన్నీరె గాని పన్నీరులెదయ్య-చెయలేను పన్నీటి అభిషేకము
వేదనలెగాని వేదాలనెరుగను-చేయుటెట్లు స్వామి మంత్రాభిషేకం
సంసార సంద్రాన మునగంగ నాకెది గంగ నీ శుద్ధోదక స్నానానికి
పంచేంద్రియాలె నను పట్టించుకోవయ్య పంచామృతాభిషేకానికి

నా కనుల కలువలతొ చేసేను స్వామి పుష్పాభిషేకమ్మును
మధురమౌ నీదు నామాలు పలికీ చేసేను తేనె అభి షేకమ్మును
శ్రావ్యమౌ నీదు నామాలు పాడీ చేసేను గానామృతమ్మును
మనసు చిలికిన వెన్న నాజ్యంగ మార్చీ చేసేను నేయ్యాభి షేకమ్మును
మధురమౌ నీదు నామాలు పలికీ చేసేను తేనె అభి షేకమ్మును
శ్రావ్యమౌ నీదు నామాలు పాడీ చేసేను గానామృతమ్మును
మనసు చిలికిన వెన్న నాజ్యంగ మార్చీ చేసేను నేయ్యాభి షేకమ్మును
చెమరించె నయనమ్ములు –మణికంఠ కనిపించు నాకోసము
ఆనంద భాష్పాలతో అయ్యప్ప- చేసెదను అభిషేకము
చెమరించె నయనమ్ములు –మణికంఠ కనిపించు నాకోసము
ఆనంద భాష్పాలతో అయ్యప్ప- చేసెదను అభిషేకము
No comments:
Post a Comment