కొత్తచీర కావాలా-పట్టురైక తేవాలా-
ఏకంగా వడ్డాణమే చేయించుకురావాలా 
(ఆమె):ముద్దూ లేదు మురిపెం లేదు ఎందుకు కిట్టయ్యో
గానుగెద్దులా గంగిరెద్దులా బతుకే అయ్యిందయ్యో 
కొత్తచీర నాకొద్దు చేరదీస్తె చాలయ్యో-
పట్టురైక నాకేల నన్ను పట్టుకోవయ్యో-
ఉడుంపట్టు పట్టావంటే వడ్డాణాలే దండుగయ్యో 
1. చరణం(అతడు):
చంకకెత్తుకుందామంటే-గంగవై నెత్తికెక్కేవు
కోరికోరి చేరువైతే-గౌరిలాగ ఆక్రమిస్తావ్ 
చిక్కేనే నీతోటి చక్కనైన చినదానా 
చిక్కకుంటె దిక్కేలేదు నను వలచినదానా 
2. చరణం(ఆమె):రాముడోలె నిన్నెంచుకుంటే-సీత కష్టాలు నావాయే 
కృష్ణుడని భావించుకుంటే-భామలు గుర్తొచ్చి భయమాయె
వేగలేను నీతోటి తిరకాసు చిన్నయ్యా 
నన్నునేనె ఇచ్చుకున్నా మనసుదోచినయ్యా
 
 
No comments:
Post a Comment