Wednesday, December 2, 2009

OK

కంటిచూపు చాలు- వింటితూపులేల
ఒంటి వంపు చాలు-ఇంక ఖడ్గమేల
మాటలే కావాలా మనసు దోచడానికి
పదములే కావాలా ఎదను గెలవడానికి

1. చిన్న నవ్వు చాలు చిత్తు చేయడానికి
బుగ్గ సొట్ట చాలు బుగ్గి చేయడానికి
పెదవి మెరుపు చాలు మృతులవ్వడానికి
మూతి విరుపు చాలు చితిని చేరడానికి

2. వయ్యారాల నడకనే వెర్రెక్కించు
సోయగాల ఆ నడుమే కైపుతలకెక్కించు
అంగాంగ భంగిమలే చొంగనే కార్పించు
పడతి పరువాలే పిచ్చిగా పిచ్చెక్కించు

2 comments:

Apparao said...

బాగా వ్రాసారు! ఒక ఫోటో పెట్టి ఉంటే, ఫోటో చూస్తూ, కవిత చదువుకునే వాళ్ళం కదండీ

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

ధన్యవాదాలు శాస్త్రి గారూ!మీరు నా బ్లాగ్ చూసినందుకు,..కామెంట్ రాసినందుకు... మంచి సలహా ఇచ్చినందుకు...!
అయితే బ్లొగ్ ని సర్వాంగ సుందరంగ తీర్చిదిద్దలనేది నా అభిమతం కూడ..
కాని నాకు ఆ ఫోటోలు దొరకవు దొరికినా అవి సరిగ్గా అప్లోడ్ కావు..
ఏంచేసేది..సారీ ..నా నెట్ చాలా వీక్