Tuesday, February 2, 2010

ఆత్మహత్య ఎలాచూసినా-అవమానం అతిహేయం

నేర్పుతుంది జీవితమే
అనుక్షణం కొత్త పాఠమే
ఓడిపోతుంది ఒకనాడు ఓటమే
ఓర్పుతో సాధిస్తే వరించేను విజయమే
1. అద్భుతాలు జరిగి ఎవ్వరూ- కాలేదు గొప్పవారు
అదృష్టం నమ్ముకొని అవలేదు-మహానీయులు
ఇటుక మీద ఇటుక పేర్చి -కడితేనే మేడగ మారు
పునాదియే పటిష్టమైతే –కట్టడాలు చరితనుచేరు
2. నిద్రలేమి రాత్రులెన్నో- గడిపారు కీర్తి చంద్రులు
సాధనయే ఊపిరిగా- సాగారు లక్ష్య పథికులు
పక్కదోవ పట్టలేదు –ఎన్నడైనా విజేతలు
ధ్యేయాన్ని మరువలేదు –కలనైనా జిష్ణువులు
3. భగీరథుని సంకల్పం-అవ్వాలీ నీకభిమతం
సడలని విక్రమార్కుని-పట్టుదలే నీకాదర్శం
ఏకలవ్యు నేకాగ్రతయే- ఎప్పటికీ నీకు హితం
అభిమన్యుని విక్రమతే-సదా నీకు ప్రామాణ్యం
4. ఆత్మహత్య ఎలాచూసినా-అవమానం అతిహేయం
కన్నవారి గుండెకోత- అసమానం దయనీయం
సంపూర్ణ ఆయుర్దాయం-సర్వులకిల అనుభవనీయం
ప్రయత్నిస్తె ఎన్నటికైనా-పాదాక్రాంతం నీకు జయం

10 comments:

పరిమళం said...

"ఆత్మహత్య ఎలాచూసినా-అవమానం అతిహేయం
కన్నవారి గుండెకోత- అసమానం దయనీయం
సంపూర్ణ ఆయుర్దాయం-సర్వులకిల అనుభవనీయం
ప్రయత్నిస్తె ఎన్నటికైనా-పాదాక్రాంతం నీకు జయం "
మంచి సందేశాన్నిచ్చారు ఇది చదివిన కొందరైనా చేయూతగా ఉండి అటువంటి ఆలోచనలతో ఉన్నవార్నిమానసికదౌర్బల్యం నుండి బైటకుతేవాలి ధైర్యాన్ని నింపాలి.చాలా ఉత్తేజ భరితంగా రాశారు .

Anonymous said...

chala bagundandi.

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

thanks anaamika gaaroo..
mariyu parimalam..gaarooo..
mee anta sunnitanagaa cheppaleka poyaanemo.......

budugoy said...

ee photo dharmapuri konerudaa?

budugu said...

mee blog lo unna photo dharmapuri konerudaa?

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

avunu budugu ilaa prathi kaarteeka paurnami roju padivela (deepaalato )pramidalatO alankaristaaru..baagundaa.. eesaari vacchesi pratyakshangaa veekshinchandi

budugu said...

ha ha meeru ae inti mundu nilucuni ee foto teesukunnaaro aa intlone nenunde vaanni :) dmp is nice place with temple, river. aa koneru maatram chikaaku sumee

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

inthakoo tama parichayam budugu gaarooo????

budugu said...

why dont i remain anonymous for some more time :) just think of me as a dharmapuri lover. But rest assured. Here onwards I am going to read everything u write and criticize justly :)

Spent some of my formative years over there and just love the place/temple/river. I make sure I visit that place every year atleast once.

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

as u wish if u need, u can take my ym id rakigita9@yahoo.com rest is ok thnx for ur support