ఎ ద కో యి ల కో వె ల.
ఆమని అరుదెంచినా-మామిడి చిగురించినా
పాడవేల కోయిలా-మూగవైతివే
ఎలా?
ప్రేమగ నిను పిలిచినా-ఎంతగ కవ్వించినా
ఉలకవైతివే పికమా!అలక ఏల ప్రియతమా !!
1. 1. గ్రీష్మ౦
భీష్మి౦చినా-వర్ష౦ వారించినా
శరత్తే చకోరాల-మత్తులోన మునిగినా
హేమంతం పంతంగా-ముఖం చాటేసినా
శిశిర౦ కలవరపడి -మాట దాటవేసినా
వసంతం తనుసాంతం-నీకు సొంతమయ్యెగా
నీ గీతం అమృతమని-నీకు బానిసయ్యెగా
పాడవేల కోయిలా- మూగవైతివే
ఎలా?
ఉలకవైతివే.పికమా!అలక ఏల ప్రియతమ!!
2. 2. గాలి
కూడ కలుషితమై-ఊపిరాడకున్నదా
నిర్మలమగు నీరు లేక-దప్పి దీరకున్నదా
నిప్పులకొలిమిలాగా-ఎ౦డ బాధించెనా
ప్రశాంతతే కరువైన-ప్రకృతి వేధించెనా
తోడెవరూ లేరనుకొని-ముభావంగ ఉన్నావో
కోవెలలో దేవతగా-కొలిచే నను మరిచావో
పాడవేల కోయిలా-మూగవైతివే
ఎలా?
ఉలకవైతివే పికమా...!అలక ఏల ప్రియతమా..!!
No comments:
Post a Comment