స్వయం’భు’వన మోహిని
వర్ణించలేదు ఎవరూ..కావ్యాలలో...-
తిలకించలేదు ఎపుడూ...స్వప్నాలలో...
తిలకించలేదు ఎపుడూ...స్వప్నాలలో...
సాక్షాత్కరించినావు....రెప్పవేయనీయనట్లుగ-
ప్రత్యక్షమైనావు .....సాగిలపడునట్లుగా
ప్రసాదించవే చెలి... క్రీగంటి వీక్షణం.
కై౦కర్యమైపోతానే.నా.జీవితాంతం
1. సుందరాంగులెందరో...చేస్తారు వందనాలు..
అందగత్తెలె౦దరో....దాసోహమంటారు
ముజ్జగాల ముదితలు సైతం చేష్టలుడిగి
చూస్తారు
బ్రహ్మ కూడ
నిన్ను చూసి బిత్తర పడిపోతాడు
అతిలోక
సుందరీ..అన్న పేరు నీదేనేమో.
నీ దర్శన
భాగ్యమే నా పూర్వ పుణ్యమేమో
2. దేవతవు నీవనను..మాయమైపోదు వేమో..
అప్సరసవు నీవనను...అందకుండా పోదువేమో..
నీ దరహాసం కురిసే శరత్కాల జ్యోత్స్న లు
నీ నయనాల మెరిసే నక్షత్ర జ్యోతులు
ఏమందు నే నిన్ను కుందనాల బొమ్మా..
తనివిదీర నిన్నుగనగ సరిపోదు ఒక జన్మ
3. పెద్దన నిను చూసి ఉంటే..ఉన్మత్తుడయ్యే
వాడేమో..
శ్రీనాథుడు నిన్ను గాంచి
ఉన్మదితుడుఅయ్యేనేమో
వర్ణాలు సరిపోవే..నిన్ను వెలయించ
పదములకు..పాటు గాదే..నిను ప్రస్తుతించ
మతిభ్రమించకముందే..నన్ను కాస్త దయగనవే
వెర్రి శ్రుతి మించక ముందే..నన్నిక
గైకొనవే..
No comments:
Post a Comment