పల్లవి: గడ్డి పూవు నా కవిత-అందగించదూ చదూ..పరిమళించదూ
గాలి పాట నా గానం–సరిగమించదూ..మనసు మించదు
చిల్లి గవ్వ జీవితాన....కూలె
పేక మేడ..
నగుబాటు నాటకాన... చింతల
జడివాన..
1.
చేతికందు పరమాన్నం.-నోరు చేరు తీరే మారు
పట్టుకుంటె పసిడైనా సరే-రాకాసి బొగ్గై తీరు
వక్ర గతుల గ్రహబలమేమో..జడలువిప్పి బుసకోడుతోంది..
జన్మకాల దోషమేదో..వెంటాడి వేధిస్తోంది..
2.
శ్రీరామా అనినేనంటే..ఛీ త్కార మనిపిస్తోంది..
చిన్ననాటి హితునికి సైతం ..విరోదిగా తోస్తోంది..
తప్పుకోవడానికి...తరుణోపాయమేది లేదు..
తప్పునాది కాకున్నా నింద తప్పడం లేదు..
3.
విజ్ఞాన భానుడి నైనా మరుపు మబ్బు కమ్మేస్తోంది
అసహాయ శూరుడినైనా..వ్యూహమేదో..బంధిస్తోంది..
కలిసిరాని కాలముంటే..తాడైనా కాటేస్తుంది..
చిగురించే రోజొకటో స్తే..బీడైనా..వనమౌతుంది..
బృందావనమౌతుంది..
నందన వనమౌతుంది
No comments:
Post a Comment