Tuesday, December 17, 2013

https://youtu.be/ZwZIaCTY07Q?si=ByQqyaVMafUqlAVn

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

“కళ్యాణ గీతం “

రాగం:ఆనంద భైరవి

దిగివచ్చిరి  దేవతలూ ఆత్మీయంగా
వధూవరుల మనసారా  దీవించంగా
కనీవినీ ఎరుగన౦త వైభవోపేతంగా
జరిగె ఈ పరిణయం  కమనీయంగా

జనులుమెచ్చెడి ఈడూ జోడైనఈజంట
బంధుమిత్రులందరికీ కన్నుల పంట

1.విశ్వకర్మ విస్తుపోయె మండపాన్ని నిర్మించ
రతీదేవి మతిపోయేలా పన్నీరు చిలరింప
కుబేరుడే ఆప్తుడిగా పెండ్లి పనులు నిర్వహించ
సాక్షాత్తు లక్ష్మీదేవి సాదరంగా ఆహ్వానించ

        కనీవినీ ఎరుగన౦త వైభవోపేతంగా
        అనువైన మనువుఎంతొ మనోహరంగా

2.విధాతయే విధివిధాన లగ్న క్రతువు జరిపించ
వశిష్టుడే మంగళాష్ట కాలెన్నో పఠియి౦చ
సరస్వతీదేవియే సంగీత లహరి నోలలాడించ
అన్నపూర్ణమ్మనే కమ్మగా వండీ వడ్డించ

మంత్రాక్షరాలే అక్షతలై కురియ౦గా
తిలకించిన  నయనాలే  తాదాత్మ్యంగా

3.రాధా కృష్ణుల అనురాగ రస ఝరియై
సీతారాముల అన్యోన్య కాపురమై
శివపార్వతుల అర్ధ నారీశ్వర వివరమై
వర్దిల్లనీ వధూవరుల దాంపత్యం వరమై

శ్రుతిలయ లయమై భజంత్రీలు మ్రోగంగా
శుభకరమౌ వివాహం శ్రవణపేయంగా

4.అత్తింటికి వెలుగిస్తూ అనూష దీపికగా
ఆడపడచులందరికీ తలలో నాలుకగా
సిద్దీశ్ మది నెరిగి చేదోడు వాదోడుగా
ఖ్యాతి పొంది మా గారాలపట్టి  పుట్టింటికీ పేరు తేగ

        కనీవినీ ఎరుగన౦త వైభవోపేతంగా
        జరిగెఈ  కల్యాణం ఆహ్లాదకరంగా

No comments: