హృదయాన్ని వెలిగించి ఇస్తున్నా హారతి
ప్రియమారగ గైకొనుమా కొండగట్టు మారుతి
లేరయ్యా వేరేవరూ నినువినా మాకుగతి
కరుణించి మము జేర్చుము కైవల్య పద గతి
1. 1. పిలువగనే
బదులిచ్చే-పరమ దయాళువే నీవు
కోరగానే వరమిచ్చే –కల్ప
వృక్షమే నీవు
సంజీవని గొని
తెచ్చిన –ప్రాణదాతవే నీవు
సీతమ్మ జాడను తెలిపినా-రామ దూతవేనీవు
లేరయ్యా వేరేవరరూ నినువినా మాగతి
కరుణించి మము జేర్చు కైవల్య పదగతి
2. 2 గ్రహ పీడలు
పరిమార్చగ-అనుగ్రహము కోరుకొంటి
సంకటముల నెడబాపగ-నీవే ఇక
శరణంటి
వాక్సుద్ధి
నీయమని-వాగధీశ నిను వేడితి
గాత్ర శుద్ధి
కలుగజేయ-నీ పదముల తలనిడితి
లేరయ్యా వేరేవరరూ నినువినా మాగతి
కరుణించి మము జేర్చు కైవల్య పదగతి
3. 3.చాంచల్యము తొలగించు-స్వామీ
ఓ జితేంద్రియా
ఆత్మ స్థైర్యమే
పెంచు-స్వామి భక్తి పరాయణా
అడుగడుగున మము
నడిపే మార్గదర్శి వేనీవు
ఆయురారోగ్యాలను ఇచ్చేటి చిరంజీవుడవు
లేరయ్యా వేరేవరరూ నినువినా మాగతి
కరుణించి మము జేర్చు కైవల్య పదగతి
No comments:
Post a Comment