Sunday, September 17, 2017

https://youtu.be/fUxtddMiA20?si=PVeTbJiwvwb9ఎల్ఫ్ల్

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం :వసంత



కోరనివెన్నో - తేరగ ఇచ్చావు
వేడని నాడూ - వేదన తీర్చావు
కంటిపాపలా - ననుకాచావు
మంచి మార్గమే-నువుచూపావు
ఆనందాల-తేలునంతలో
ఎందుకు స్వామీ-ననువీడావు
సుడిగుండాలలొ-ననుతోసావు

1.శ్రద్ధాసక్తులు-కనబరచలేదు
రేయీపగలూ-కృషిసలుపలేదు
ఉన్నత లక్ష్యాలు-ఊహించలేదు
ఏసరదాలు-నే కోల్పోలేదు
ఐనా స్వామీ-అంతానీదయ
పొందినదంతా-నీ దయా

2.ఆశించినది-నాకందలేదు
అంతకు మించే-ప్రసాదించావు
తలచినదేదీ-నువుచేయలేదు
ప్రతి ప్రతిఫలము-నాకతిశ్రేయము
కష్టాలకడలిలో-ఈదాడినా స్వామీ
ఏతడి ఒంటికి-అంటనీయవు

3.మొగ్గలోనే-పువ్వును చిదిమేవు
మధ్యలోనే-నాచేయి వదిలేవు
మందేలేని-గాయాలు చేసేవు
గుండెను పిండిమరలో నలిపేవు
ఎరుగము స్వామీ-నీ అంతరంగము
నను దరిజేర్చగ-నీదే భారము

No comments: