Saturday, October 28, 2017

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

"దైవం మానుష రూపేణా..."

నిజమే లేదు-నువ్వున్నావను మాటలో
ఋజువే లేదు- మా అనుభవాలలో
ఉన్నావో లేవో తెలియని ఓదైవమా...
నమ్మలేను నిన్ను మనస్పూర్తిగా
అర్థించక మానలేను ఆర్తిగా

1.చెప్పడానికేముంది-పుక్కిటి పురాణాలు
విప్పడానికేముంది-గుప్పిటి రహస్యాలు
అదిగోపులి యిదిగో తోకయన్న చందము
మేమిచ్చిన గొప్పతప్ప ఏదీనీ మహత్మ్యము

మార్చుకోను నాగతి ఆధ్యాత్మిక దారికి మళ్ళక
ఉండలేను మసీచ్చర్చ్ గుళ్ళకు నే వెళ్ళక

2.ఉన్నట్టుండి తేగలవు-ఉపద్రవాలు
నట్టేట ముంచగలవు -మా జీవితాలు
పరిష్కార మెరుగక'నే వేతు వేల(?) సవాళ్ళు
ఉంటేగింటే నీ ఉనికి -చేయవేల అద్భుతాలు

కలోగంజో తాగుతా నా కష్టార్జితం
సాటిమనిషినడుగుతా ఆదుకొనగ సాయం

మనిషి మనిషిలో చూస్తా దైవమనే నీ భావం

28/10

No comments: