https://youtu.be/yxTGFPQLPhU?si=KJsGtY-ZE6yAhJnU
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం:వాసంతి
అలవాటుగ మారింది నాకు
ప్రతివారం నీ పాటరాయడం
ఆనవాయితయ్యింది స్వామి
పదేపదే నిన్ను కీర్తించడం
నేను రాయగలనా నావెర్రిగాక పోతే
పదమైనా కదులుతుందా నీ ఇచ్ఛలేకపోతే
వందనాలు వేంకటేశ తిరుమలేశ గోవిందా
1.శనివారం వచ్చిందంటే
శ్రీనివాస నీదే మననం
ఏమి మిగిల్చాడు స్వామి
అన్నమయ్య నీకవనం
కొత్తగా ఏమి లిఖించను నీగురించి
తనకూ అసాధ్యమనడా ఆ విరించి
2.రూపు రేఖలన్నిటినీ
వర్ణించినాను ఇదివరకే
గుణగణాలనన్నీ స్వామీ
కొనియాడితి నే శక్తి మేరకే
ఎరిగినంత నీ చరితము నుడివితిని
నా ఈతి బాధలను నివేదిస్తిని
కోరికలీడేర్చమని నిన్ను వేదిస్తిని౹
No comments:
Post a Comment