Monday, August 5, 2019

https://youtu.be/CcvO-nf8qnA

శివనామమెంత మధురము
శివపూజ ఎంత సులభము
హరుని హృదయమంతా కారుణ్యము
మరుని హరుని సేవిస్తే కైవల్యము,కైలాస వాసము

శివ శివ హరహర శంభో మహాదేవా
శివ శివ హరహర శంభో మహాదేవా
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

కోవెల కానరాకుంటే నదితీరమైన చాలు
లింగము దరిలేకుంటె సైకతముదైన చాలు
పంచామృతాభిషేకమేల దోసిలి జలమైన మేలు
డంభాలంకారములేల చిటికెడు విభూతి చాలు
దిగంబరుడు శుభంకరుడు చిన్మయానందయోగి పుంగవుడు

శివ శివ హరహర శంభో మహాదేవా
శివ శివ హరహర శంభో మహాదేవా
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

నమ్మికొలువ తమ్మిపూలైనా మెచ్చుతాడు
మనసార అర్పిస్తే మారేడు పత్రియే చాలు
విమలబుద్ధి నర్చించగ కమలాలైన చాలు
పత్రంపుష్పంఫలంతోయం శివుని కైంకర్యాలు
గంగాధరుడు చంద్రచూడుడు రుద్రాక్ష మాలా ధారుడు

శివ శివ హరహర శంభో మహాదేవా
శివ శివ హరహర శంభో మహాదేవా
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

శివనామమెంత మధురము
శివపూజ ఎంత సులభము
హరుని హృదయమంతా కారుణ్యము
మరుని హరుని సేవిస్తే కైవల్యము,కైలాస వాసము

శివ శివ హరహర శంభో మహాదేవా
శివ శివ హరహర శంభో మహాదేవా
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

No comments: