Friday, October 11, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

"బాలికే ఏలిక"

అష్టాదశ శక్తి పీఠాలకాలవాలం
శకుంతలాపుత్ర భరత ఖండం
ఆడపిల్ల రక్షణకై అతలాకుతలం
అమ్మలేక జన్మెరుగని ఇలాతలం
ఇంకానా ఇంతికి ఇంతటి దౌర్భాగ్యం
గర్భాంతర స్త్రీశిశువుల వికృత విఛ్ఛినం

1.ఎంతపెరిగి పోతేనేమి నాగరికతా
మింటికెగసి లాభమేమి విజ్ఞాన సంపద
మహాలక్ష్మి పుట్టిందను మాటలే'మాయే
వివక్షతో అనుక్షణం వనిత నలిగి పోయే
అత్తలూ తల్లులూ కానివారా వారాడపిల్లలు
చెట్టును నరికే గొడ్డలి కామాలకు పోలికలు

2.పుట్టింవారంటే ప్రాణంపెడుతుంది పడతి
మెట్టినింటికె మేలైన గౌరవమౌతుంది మగువ
ఏ పుత్రుడు దాటించునొ పున్నామ నరకాలు
వృద్ధిచెందే నెందుకో  వృద్ధాశ్రమాలు
మంచి పెంపకముతోనే మానవ వికాసం
కొడుకైనా కూతురైన మన నెత్తుటి ప్రతిరూపం

No comments: