Friday, October 11, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:మాండు

నీవు చూడని పార్శ్వం నీ అనుమాన కారణం
నీకు తెలియని కోణం నీ అజ్ఞానపు నిదర్శనం
మెరిసే ప్రతి వస్తువు బంగారం కాదు
ద్యోతకమయ్యేదంతా వాస్తవం కాదు
ఆలోచించు నేస్తమా  అంచనాలు మించి
మనసు మీటు మిత్రమా ఎద రాగవిపంచి

1.నింగీ నేలా కలిసేనా దిక్చక్ర భ్రమ గమనించు
సింగిడి రంగులన్నీ కాంతి దృగ్విషయంగ ఎంచు
ఎండమావి భ్రాంతి దప్పి తీర్చుననిపించు
భావించుకున్నవన్ని సత్యాలైపోతాయా
వద్దనుకున్నవన్ని కాకుండా పోతాయా
ఆలోచించు నేస్తమా  అంచనాలు మించి
మనసు మీటు మిత్రమా ఎద రాగవిపంచి

2.కళ్ళజోడు రంగునంత లోకానికి పులుమకు
థృక్పథాన్ని విడనాడక ఊబిలోకి దిగజారకు
పట్టుకున్న కుందేటి కాళ్ళ సంఖ్య మరువకు
మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి మనకు
గుణపాఠంనేర్పతుంటె కాదుకూడదేమనకు
ఆలోచించు నేస్తమా  అంచనాలు మించి
మనసు మీటు మిత్రమా ఎద రాగవిపంచి

No comments: