Monday, October 14, 2019

https://youtu.be/P0qwGffUG9k?si=6ie-nu1ojo6Xy9F2

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం: దర్బార్ కానడ

శ్రుతి ప్రకృతి పార్వతి
లయకాల కాలుడవు నీవె పశుపతి
రచియించినావు సంగీత శాస్త్రము
వెలయించినావు నటరాజా నాట్యము
చంద్రకళాధర నీవు ఆదికళాకారుడవు
తాండవకేళీలోల తకిట తధిమి చైతన్య రూపుడవు

1.అనాలంబి వీణ మీటి రాగ సృష్టి సల్పినావు
అర్ధాంగి అపర్ణకు గాంధర్వము నేర్పినావు
మేళకర్త మెళకువలు అలవోకగ తెలిపినావు
మనోధర్మ సంగీత మర్మము నెరిగించినావు
సామవేద సారమంత ధారపోసినావు
శిశర్వేత్తి పశుర్వేత్తి గానసుధలు గరపినావు

2.ప్రదోషసమయాన ఆనంద తాండవము
విశ్వ విలయకాలన ప్రళయ తాండవము
చిందేయగ సదా శివా నీకు చిదానందము
ఆటపాట బ్రతుకుబాట కదా నీ బోధనము
సప్తస్వర వరదాయక ఓం నమఃశివాయ
సప్తతాళ ప్రసాదకా నమో సాంబశివాయ

No comments: