Monday, October 14, 2019

ఏది భద్రత మరి ఏది భరోసా
ఏరుదాటి తెప్ప తగలేసే తమాషా
ఎంతమంది బలిదానాల ఫలితము
వండుకున్న కూటిని కాలదన్ను వైనము
ఇందుకేనా ప్రత్యేక తెలంగాణా
ఇదేనా కోరుకున్న బంగరు తెలఁగాణా

1.కప్పదాటు మాటలెన్నొ లెఖ్ఖలేవు
మాటమార్చి ఘటనలెన్నొ దాటుతావు
సంభాషణ చతురతలో ఎవరైనా బలాదూరె
ఏఎండకాగొడుగే రివాజుగా మారె
తెలంగాణ వ్యతిరేకులు చుట్టాలైపోయే
ఉద్యమవీరులంత పట్టరానివారాయే

2.కుతంత్రాల గెలుపెప్పుడు శాశ్వతం కాబోదు
మాయచేయు నైపుణ్యం కడదాకా నిలవదు
జైకొట్టిన ఆ నోళ్ళే ఛీ కొట్టుట అవసరమా
గుడ్డిగానమ్మినోళ్ళే వద్దను వ్యవహారమా
అహంకార పరదాలను అటకెక్కించు
తరతరాలు కీర్తించే ఘనచరితను లిఖించు

No comments: