Tuesday, October 22, 2019

దండలెన్నొ వేస్తున్నా -గండాలు కాయమని
దండాలు పెడుతున్నా-అండగా ఉండమని
బండరాయి నాగుండె-నువు కూర్చుండ బాగుండె
సద్గురు సాయినాథా నీదయతో  నా కలలే పండే

1.ఇంటింటా పటములు నిలిచె-ఊరూర నీ గుడులే వెలిసే
ప్రతి మనిషీ నిన్నే తలచే-ప్రతి నాలుక నీనామం పలికే
గురు పౌర్ణమి ఉత్సవమాయే-గురువారం జాతరలాయే
ఇంతకన్న ఇంకేముంది నిదర్శనం-మదికెంతొ హాయీ నీ దర్శనం

2.తిరుపతీ  కాశీ సమము-షిరిడి యాత్రచేయగ ఫలము
ద్వారకామాయి స్థానము-అపర ద్వారకే నిజము
విభూతి ధారణతో అనుభూతులు అనుపమానము
సకలదేవతా స్వరూపము సాయినాథ నీ అవతారము




No comments: