Monday, October 21, 2019

రచన.స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:చారుకేశి

ఏమున్నదో రాధమ్మలో
కిట్టయ్యనే కట్టివేసే పాశము
ఏ కిటుకునే కనిపెట్టెనో
కన్నయ్యనా కట్టుకొను మంత్రము
అష్టభార్యలూ ఇష్టసతులే
గోపికలంతా ప్రేమమూర్తులే

1.సాయం సమయమున
ఆపేక్షగ ప్రేక్షకి ఆ యమున
బృందావనమున ఎదలయ సాయమున
మాధవ కలయికె ఏకైక ధ్యేయమున
ప్రతీక్షలో ప్రతిక్షణం రాధిక ఒక అభిసారిక

2.సుధనే మించిన అధర మాధురి
సౌరభమొలికే కతన తనురస ఝరి
తనువే విరిసరి తపనలు కొసరి కొసరి
తల్పము తలదన్ను ఊరువుల మృదు దరి
తలపుల తన్మయి రాధిక తత్వమసియే తానిక

No comments: