Thursday, October 1, 2026

 https://youtu.be/C8PssuxKQAk

రాగం : ఆనంద భైరవి

రచన, స్వరకల్పన & గానం: డా. రాఖీ

[పల్లవి]

శిశిరం పుష్పిస్తే నిత్య వసంతం

గ్రీష్మం హర్షిస్తే మురియును కురియును వర్షం

బాల్యం వికసిస్తే నవ్య కౌమారం దివ్య సౌందర్యం

కౌమారం పరిణమిస్తే యవ్వన పరువాలకు స్వాగతం

ఆరోహణ ఋతుగీతం మానవ జీవితం

మానిని జీవితం

[చరణం 1]

ఆట పాటల నిన్నటి చిన్నారి బాలిక

పెరిగే కొద్దీ మేని మార్పులు సహజమే ఇక

పుష్పించే వయోలక్షణం స్త్రీకి ప్రకృతి కానుక

తరుణికి తనదంటూ జరిగే తొలి తొలి వేడుక

[పల్లవి]

శిశిరం పుష్పిస్తే నిత్య వసంతం

గ్రీష్మం హర్షిస్తే మురియును కురియును వర్షం

బాల్యం వికసిస్తే నవ్య కౌమారం దివ్య సౌందర్యం

కౌమారం పరిణమిస్తే యవ్వన పరువాలకు స్వాగతం

ఆరోహణ ఋతుగీతం మానవ జీవితం

మానిని జీవితం

[చరణం 2]

పడుచుగా పడతిగా దక్కేదే ఈ గౌరవం

అమ్మకు నాన్నకు ఎదిగే శుభాంగి ఎంతో సంబరం

ఇరుగు పొరుగు బంధుమిత్రులతో పండుగ ఉత్సాహం

ఇంటిల్లిపాదికీ ఆనందభాష్పాలు చిప్పిల్లే నిండగు ఉత్సవం

[పల్లవి]

శిశిరం పుష్పిస్తే నిత్య వసంతం

గ్రీష్మం హర్షిస్తే మురియును కురియును వర్షం

బాల్యం వికసిస్తే నవ్య కౌమారం దివ్య సౌందర్యం

కౌమారం పరిణమిస్తే యవ్వన పరువాలకు స్వాగతం

ఆరోహణ ఋతుగీతం మానవ జీవితం

మానిని జీవితం

[చరణం 3]

మంగళ స్నానాలు నూతన వస్త్రాలు ఆభరణాలు

శుచీ శుభ్రతలు అలంకరణలు పచ్చని తోరణాలు

పసుపు కుంకుమ గాజులు పూలు చీరసారెలు ముత్తైదువలకు వాయణాలు

పెద్దల ఆశీర్వాచనాలు అతిథులందరికీ కమ్మని విందు భోజనాలు

[పల్లవి]

శిశిరం పుష్పిస్తే నిత్య వసంతం

గ్రీష్మం హర్షిస్తే మురియును కురియును వర్షం

బాల్యం వికసిస్తే నవ్య కౌమారం దివ్య సౌందర్యం

కౌమారం పరిణమిస్తే యవ్వన పరువాలకు స్వాగతం

ఆరోహణ ఋతుగీతం మానవ జీవితం

మానిని జీవితం

[చరణం 4]

హద్దుల మధ్యన స్వేచ్ఛ ఎగిరే ముగ్ధగ ఆహ్లాదం

సాధికారత స్వావలంబనే సుదతిగ ప్రాథమ్యం

విద్య ఉద్యోగాలు ఆకాశంలో సగమయ్యే భాగస్వామ్యం

తీర్చిదిద్దుకుంటే తెఱవకు తనదైన తీరైన భవితవ్యం

[ముగింపు]

శిశిరం పుష్పిస్తే నిత్య వసంతం

బాల్యం వికసిస్తే నవ్య కౌమారం దివ్య సౌందర్యం

కౌమారం పరిణమిస్తే యవ్వన పరువాలకు స్వాగతం

ఆరోహణ ఋతుగీతం మానవ జీవితం

మానిని జీవితం