కలలొ కలుసుకుందాం ప్రతి రాత్రి
నెమరువేసుకుందాం మన మైత్రి
నిరాశయే దరిరాదు నీకు నేను తోడుంటే
నిస్పృహే మరిలేదు నీవే నా నీడంటే
1.ఉక్కగా ఉన్నాగాని తిక్కగా ఉన్నాగాని
నా పక్కన నువ్వనుకుంటె అదే అదే ఆమని
చీకటే చిమ్మినగాని అమావాస్య కమ్మిన గాని
నీతో సాహవాసమే కార్తీక పౌర్ణమి
2.నీ ఊహే మలయసమీరం నీ ఊసే మధుర సంగీతం
నీవున్న తావే మొగిలి పూల తావి
నీ పలుకే మంజులనాదం నీ భావం పవిత్రవేదం
బంధాలకే అందం నీతో అనుబంధం
నెమరువేసుకుందాం మన మైత్రి
నిరాశయే దరిరాదు నీకు నేను తోడుంటే
నిస్పృహే మరిలేదు నీవే నా నీడంటే
1.ఉక్కగా ఉన్నాగాని తిక్కగా ఉన్నాగాని
నా పక్కన నువ్వనుకుంటె అదే అదే ఆమని
చీకటే చిమ్మినగాని అమావాస్య కమ్మిన గాని
నీతో సాహవాసమే కార్తీక పౌర్ణమి
2.నీ ఊహే మలయసమీరం నీ ఊసే మధుర సంగీతం
నీవున్న తావే మొగిలి పూల తావి
నీ పలుకే మంజులనాదం నీ భావం పవిత్రవేదం
బంధాలకే అందం నీతో అనుబంధం
OK
No comments:
Post a Comment