"తస్మాత్ జాగ్రత జాగ్రత"
అనుకోని అతిథి కాదు
అనూహ్యమైన ఆగంతకుడూ కాదు
రాక తప్పని మృత్యుదూత
పడక తప్పదు దానివాత
వస్తుందా ఛస్తుందా అనుకోకు మిత్రమా
నాకైతే సోకదని భావించకు నేస్తమా
మినహాయింపేమి లేదునీకు ప్రియతమా
కనికరం లేనిదే కరోనా
నిర్లక్ష్యానికి మరణమే జరిమానా
1.జాగ్రత్తగ ఉన్నా తప్పుకొనగ కష్టము
ఏమరుపాటైతే కరోనా కడు స్పష్టము
నవ్వులాట కాదు నీదీ నీవారి జీవితం
తిరిగిరానిదొక్కటే మనిషి ప్రాణము
కనికరం లేనిదే కరోనా
నిర్లక్ష్యానికి మరణమే జరిమానా
2.మొక్కుబడిగ పెట్టుకొనే మూతి మాస్కులు
ముక్కువరకు తెరిస్తే తొలగవసలు రిస్కులు
చీటికి మాటికి బయటకొచ్చి ఏల వేస్ట్ హస్కులు
అత్యవసరాలు వినా మాను అన్ని టాస్కులు
కనికరం లేనిదే కరోనా
నిర్లక్ష్యానికి మరణమే జరిమానా
3.నువ్వులు ఆవాలు తప్పని సరి డైట్ కై
నిమ్మ నారింజలు తినాలి విటమిన్ సి కై
పెంచుకొనే కృషిచెయ్యి బాడీ ఇమ్యూనిటి కై
భౌతికదూరమొకటె కరోనరహిత కమ్యూనిటి కై
కనికరం లేనిదే కరోనా
నిర్లక్ష్యానికి మరణమే జరిమానా
4.వెంటాడి అంటకునే వింతవ్యాధిది సునో నా
అంటుకుంటె అంతుచూచు వైరసీ కరోనా
లంగ్స్ పగిలి ఊపిరాగి చిత్రవధతొ మరో నా
హెచ్చరికలు ఆచరిస్తే కిసీసే కభీ భీ డరో నా
కనికరం లేనిదే కరోనా
నిర్లక్ష్యానికి మరణమే జరిమానా
No comments:
Post a Comment