Monday, August 31, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:ఖరహరప్రియ

తరిగిపోదు అందం తరుణిదెప్పుడు
ఇగిరిపోదు  చందనగంధం ఇంతిదెన్నడు
తరాలెన్నిమారినా ఇనుమడించు తన్వి సోయగం
మాతృత్వం తొణికిసలాడగ మానిని సౌందర్యం

1.మబ్బు మూటగట్టుకొంది మగువ కురుల స్వైరవిహారం
సంజె సంతరించుకుంది సుదతి నుదుటి సింధూరం
చంద్రవదన సరస్సులోనా కనులబోలె కలువల వైనం
మంకెనల సింగారం సిగ్గుల బుగ్గల నయగారం

2.రూపుదిద్దుకుంది శంఖం రమణి కంఠ మాధారంగా
గిరులు పెరిగిపోయాయి గరిత  ఎడదతొ పోటీపడగా
సెలయేరు మెలికలన్నీ హంసయాన తృటి కటివలన
జలపాతం దూకుడు సైతం తనుమధ్య పొక్కిలిలోన

No comments: