Monday, September 28, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నలుపు తెలుపు ఛాయా చిత్రమే

తీపిజ్ఞాపకాలతో  ప్రేమపాత్రమే

అలనాటి  ప్రతి రూపమన్న  ఆత్రమే

యథాతథపు చిత్రసృష్టి బహు విచిత్రమే


1.జోసెఫ్ నికోఫోర్ నిప్సే పరిశోధన ఫలితం

జగత్తునే కుదిపెనన్నది అక్షర సత్యం

రంగులమయమై సినీరంగమై విరజిల్లె అనంతరం

కదిలీ కదలని బొమ్మలై జనులనలరించనే తరంతరం


2.ఫోటో స్టూడియో మధుర అనుభూతులు

దిగిన పిదప ఉద్వేగపు ఎదిరిచూపులు

పాస్ పోర్టు మొదలుకొని ఫామిలీఫోటో వరకు

చూసి మురిసి ఆల్బంలో భద్రపరచు మేరకు


3.పౌడర్ వేసుకుని మొకానికి ప్రత్యేక మేకప్ లు

బిగదీసుక నవ్వుల చూపుల గమ్మత్తు ఫోజులు

స్వంత కేమరాతో తీసిన సాగరసంగమ భంగిమలు

వెరసి నేటికీ ఏనాటికీ మరువలేని నాటి గురుతులు

No comments: