రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
ఎందుకు ఎదురౌతారో మీ సోకుమాడ
పోడిమి పొంకాలతో ప్రాణాలు తోడ
మునగదీసుకొనుటకు మునిపుంగవులమా
ముక్కుచెవులు కోయగ రాముని తమ్ములమా
1.ముందుచూడు వెనక చూడు అందమే అందము
చెఱకును కొరికిచూస్తె ఎటైనా మాధుర్యము
మొదలేదో తుదిఏదో తెలియలేని మైకము
తనువును తడబడగజేయు తహతహ తమకము
2.దాచింది దాచంది ఏదైనా కనువిందే
మచ్చుకే మది మెచ్చగ ఆనందం పొందే
నోట మాటలేల నొసటన ఆహ్వానపత్రమే
ఓరకంటి చూపులోన ఓపలేని ఆత్రమే
No comments:
Post a Comment