రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:నీలాంబరి
నీవేమో పరమశివుడవు
నరుడను నే పామరుడను
ఏ అర్హత లేదు నాకు నీ సన్నధి కోరగనూ
ఏ యోగ్యత ఉన్నదనీ కైలాసం చేరగనూ
నమఃశివాయ మంత్రమొకటె నాకు శరణ్యం
కాశీవిశ్వేశ్వరా నీకు మారుపేరు కారుణ్యం
1.నోరు తెరిచినంతనే అబద్దాలు కుప్పలు
కళ్ళునెత్తికెక్కి నేను వదురుతాను నా గొప్పలు
వెనుకాడనెప్పుడూ చేయుటకై అప్పులు
పరులను ముంచైనా పడబోను తిప్పలు
నమఃశివాయ మంత్రమొకటె నాకు శరణ్యం
కాశీవిశ్వేశ్వరా నీకు మారుపేరు కారుణ్యం
2.అవలక్షణ లక్షితుడను నిర్లక్ష్యయుతుడను
అవహేళన పొందినా సిగ్గుపడనివాడను
నాకెదురే ఇక లేదని విర్రవీగు వాడను
ఉచితా నుచితాలనే ఎంచని వాడను
నమఃశివాయ మంత్రమొకటె నాకు శరణ్యం
కాశీవిశ్వేశ్వరా నీకు మారుపేరు కారుణ్యం
No comments:
Post a Comment