https://youtu.be/1I48bCvq5-c
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
పిల్లతెమ్మెరవై స్పర్శిస్తుంటావు
చిరు చిరుజల్లువై అల్లుకుంటావు
మినుకుమంటు వెలుగుకుంటూ తారవై పలకరిస్తావు
మనసుబాగా లేనప్పుడు మంచిగీతమై సాంత్వన నిస్తావు
మరచిపోకు నేస్తమా మరలిరా నాకోసం
శూన్యమైపోయింది నువులేని జీవితం
1.ఉదయాలూ అస్తమయాలు యథాతథాలే
ఆరు ఋతువుల ఆగమనాలు అన్నీ మామూలే
యంత్రమల్లెమారిపోయి బ్రతుకునిలా ఈడుస్తున్నా
నిన్ను చేరువేళ కోసం ఆత్రుతగా చూస్తున్నా
కడుపునిండ ఏపూటా తినలేకున్నా
కంటిమీద కునుకైనా తీయలేకున్నా
2.తోటనిండా పూలేపూలు పరిమళరహితమై
కొలనులోని నీళ్ళు సైతం క్షారభూయిష్టమై
ఇంద్రధనుసుకూడ వన్నెలన్ని వెలవెలబోయి
కోయిల గాత్రమింకా ఎంతగానొ బొంగురుపోయి
పంచతన్మాత్రలన్నీ రసవిహీనమైపోయి
నువులేని నాలోకం నరకప్రాయమై
OK
No comments:
Post a Comment