రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
నవరసమయమే నీ హృదయం
అభినందనీయం నీ ప్రతి గేయం
వెన్నెల జాలువారినట్లుగా
మల్లెలు పరిమళించినట్లుగా
నిదురించిన ప్రతి ఎదకు జాగృత గీతిగా
ప్రబోధాత్మ గీతాలకు మాతృక రీతిగా
నీ ప్రతికవనం శ్రీ చందనవనం
సాహిత్యమంతా ప్రత్యక్ష జీవనం
1.పున్నాగ పూలన్నీ ఏరికూర్చినట్లగా
దవన దళాలనే కలిపి కట్టినట్టుగా
ఆలన పాలనతో అక్షరాల బుజ్జగించి
భావనదారానికి పదసుమాలనల్లగా
నీ ప్రతికవనం శ్రీ చందనవనం
సాహిత్యమంతా ప్రత్యక్ష జీవనం
2.మబ్బులనే బ్రతిమాలి జల్లును కురిపించి
పడమటి రవినింక బామాలి నిలిపించి
ఏడువర్ణాలతో హరివిల్లిల దించినట్లు
ఏబదియారుతో కవితను అలరించినట్లు
నీ ప్రతికవనం శ్రీ చందనవనం
సాహిత్యమంతా ప్రత్యక్ష జీవనం
No comments:
Post a Comment