రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
అరెరెరె ఎంతెంత పెద్దవే ...నీ.......సోగకళ్ళు
అవ్వేమొ హై బ్రీడు అల్లనేరెడు పళ్ళు
అబ్బా ఎంత మెత్తనే దూదసొంటి నీ...ఒళ్ళు
ముట్టుకుంటె మేను ఝల్లు పట్టుకుంటె గుండె ఝల్లు
1.పెదవులైతె సామిరంగ ఎర్ర చర్రీ పళ్ళు
సిగ్గులొలుకు బుగ్గలేమొ సిమ్లా ఆపిళ్ళు
చుబుకంతొ గుర్తుకొచ్చు రసాలమావిళ్ళు
చిన్నినీ నవ్వుకే రాసిస్తారు ఊళ్ళకూళ్ళు
2.చుక్కలాంటి నల్లబొట్టు తనవంత చిచ్చుబెట్టు
కనుబొమలు విల్లై చూపుతూపు గురిపెట్టు
రెచ్చిపోగ నీ జుట్టు బ్రతుకంత కొల్లగొట్టు
కవ్వింపు నీకాటపట్టు నన్ను కాదంటె సచ్చినంత ఒట్టు
No comments:
Post a Comment