రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
చెప్పగలం కబుర్లెన్నొ కాలుకు మన్నంటకుండ
ఈయగలం సలహాలు ఉచితంగా మేనునొవ్వకుండ
గప్పాలుకొట్టగలం బరిలోకి దిగకుండా
చమత్కరించగలం సహానుభూతిలేకుండా
మనదాకా వస్తేగాని తెలియదు అసలేంటో సంకటం
ఛలోక్తులే విసురుకుంటు హేళనగా నవ్వటం
1.ఆకలిదేముంది ఉపవాసం సులభమేనంటూ
లేనివాళ్ళనెప్పుడూ ఎగతాళి చేసుకుంటూ
నిలవనీడలేకుండుట సౌధవాసి కెలాతెలుసు
ఆపదలో అర్థించుట సంపన్నులకేమెరుక
మనదాకా వస్తేగాని తెలియదు అసలేంటో సంకటం
ఛలోక్తులే విసురుకుంటు హేళనగా నవ్వటం
2.వడ్డించిన విస్తరులౌ జీవితాలెరుగవు
నిరుపేదల నిత్య బ్రతుకు పోరాటాలు
ప్రమాదాలు విపత్తులు మరణాలు నిర్లిప్తాలు
వార్తల్లో కంటూ వింటూ తెల్సుకుంటూ పైశాచిక వినోదాలు
మనదాకా వస్తేగాని తెలియదు అసలేంటో సంకటం
ఛలోక్తులే విసురుకుంటు హేళనగా నవ్వటం
No comments:
Post a Comment