రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
అష్టసిద్ధులున్నవి నీ అంగాంగాన
చతుషష్టి కళలొలుకును నీ గాత్ర రంగాన
టక్కుటమార విద్దెలు నీ హావభావాలు
కనికట్టు కలిగించును నీచూపుల ప్రభావాలు
నువ్వో మాయలాడివి నువ్వే మాయలేడివి
నువ్వో మంత్రగత్తెవి నువ్వే తంత్రవేత్తవి
1.వశీకరణమే నీకు వెన్నతొ పెట్టిన విద్య
ఆకర్శణయే నీకు సహజాతమైన విద్య
అయస్కాంతమైది చూపుకు నీ మధ్య
నువుకాదుపొమ్మంటే బ్రతుకే ఒక మిథ్య
నువ్వో మాయలాడివి నువ్వే మాయలేడివి
నువ్వో మంత్రగత్తెవి నువ్వే తంత్రవేత్తవి
2.చిరునగవులు నువువాడే పాచికలు
లయలహొయల నీకులుకులే మరీచికలు
వగల సెగలు రేపుతాయి నీ వలపుల వలలు
నీ గాలిసోకినంతనే సజీవమౌతాయి శిలలు
నువ్వో మాయలాడివి నువ్వే మాయలేడివి
నువ్వో మంత్రగత్తెవి నువ్వే తంత్రవేత్తవి
No comments:
Post a Comment