Friday, October 23, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కన్నవారి కడుపుచక్కితెలుపాలా

జగములనే కన్నతల్లికి

కడుపుతీపి పరులు ఎరుకపరుచాలా

అమ్మలనే గన్న పెద్దమ్మకు

ఎందుకు జనని నువు దయగనని

ఈజన్మనీ కడతేరనీ నీపదముల కడ తేలనీ

శ్రీవాణీ నారాయణీ దాక్షాయణీ శ్రీచక్ర నగర సామ్రాజ్ఞీ


1.కడకంటిచూపుకే మురిసేరు ముక్కోటి దేవతలు

నీ అదుపాజ్ఞలలో మసలేరు త్రిమూర్తులు

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి 

చండముండాది  దండి దైత్య నాశకి

శుంభ నిశుంభాది దానవ శమని

కినుక నీకేలనే శుకశౌనక వందిని

తుదముట్టనీ నాబ్రతుకుని నీ పదములు పట్టనీ


2.ఇచ్చావు ఎన్నెన్నో నా ఇఛ్ఛ నడగకనే

తుచ్ఛమైన వీయనేల సంతృప్తి మినహా

అనుభవించి సంతసించబోవునంతలోనే

ఉన్నది ఊడ్చేసినావు ఉత్పాలి(ఆరోగ్యము)తో సహా

మహిషాసుర మర్ధినీ  మేధో ప్రవర్ధిని

కంటగింపు ఏలనే సంకటములు దాటించగ

ముగియనీ జీవితాన్ని నీ పదముల నరయగా

No comments: